Sunday, May 4, 2025
- Advertisement -

మహిళల టీ20 ప్రపంచకప్..టీమిండియానే ఫేవరేట్!

- Advertisement -

నేటి నుండి మహిళల టీ20 ప్రపంచకప్‌ దుబాయ్ వేదికగా ప్రారంభంకానుంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఆరుసార్లు,ఇంగ్లాండ్ – వెస్టిండీస్ చెరో సారి టైటిల్‌ని దక్కించుకోగా ఈ సారి మాత్రం ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది హర్మన్ ప్రీత్ కౌర్ సేన.

అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ జరగనుండగా మొత్తం 10 జట్లను రెండు గ్రూప్ లుగా విభజించారు. గ్రూప్‌ Aలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్‌, శ్రీలంక ఉండగా గ్రూప్‌ Bలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి. అక్టోబరు 17, 18వ తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచ్​లు ,20న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఇక భారత్ మ్యాచ్‌ల వివరాలను పరిశీలిస్తే అక్టోబర్ 4న న్యూజిలాండ్‌, 6న పాకిస్థాన్‌, 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. బ్యాటింగ్, బౌలింగ్‌ తో పాటు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా ఈ సారి టైటిల్‌ గెలిచి 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక 2024 టీ20 వరల్డ్ కప్ విజేతకు ప్రైజ్‌మనీ 79,58,080 అమెరికా డాలర్లుగా నిర్ణయించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -