- Advertisement -

టీ20 వరల్డ్ కప్..ఫైనల్లో రోహిత్ సేన

- Advertisement -

టీ20 ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్‌లో ఒక్క ఓటమిని కూడా చూడని రోహిత్ సేన..ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీస్‌లోనూ అదే ఫామ్ కంటిన్యూ చేసింది. పదేండ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్‌కు చేరింది.

టీమిండియా విధించిన 172 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లాండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. అక్షర్‌పటేల్‌(3/14), కుల్దీప్‌యాదవ్‌(3/19) ధాటికి విలవిలలాడారు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్. దీంతో 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా.

అంతకముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్….టీమిండియాను బ్యాటింగ్‌ను ఆహ్వానించింది. కోహ్లీ తక్కువ స్కోరుకే వెనుదిరిగిన కెప్టెన్‌ రోహిత్‌శర్మ 39 బంతుల్లో 57, సూర్యకుమార్‌యాదవ్‌ 36 బంతుల్లో 47, పాండ్యా 23 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 171/7 స్కోరు చేసింది. క్రిస్‌ జోర్డాన్‌(3/37) వికెట్లు తీశాడు. అక్షర్‌ పటేల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -