దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు మరికొద్ది గంటల్లో ముగియనున్నాయి. ఏడోదశ పోలింగ్ మరికొద్ది గంటల్లో ముగియనుండగా అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్‌పైనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా అంతా ఎగ్జిట్ పోల్స్ పల్స్ ఎవరికి అనుకూలంగా ఉంటుందోనని ఎదరుచూస్తున్నారు.
అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? అంటే దాదాపు అటు,ఇటుగా ఖచ్చితంగా ఓకే అవుతాయనే చెప్పాలి.ఒకటి, రెండు సందర్భాల్లో తప్ప ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే రిజల్ట్స్ వచ్చాయి. అందుకే ఇప్పుడు ప్రజలంతా సినిమా ట్రైలర్ లాంటి ఎగ్జిట్ పోల్స్ అంచనాలపైనే దృష్టి సారించారు.
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అనే టెన్షన్ మొదలైంది. ఎన్నికల పోలింగ్ తర్వాత పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ని వెల్లడించగా అన్ని వైసీపీనే విజయం వరిస్తుందని తేల్చేశాయి. ఇక ఇప్పుడు అఫిషియల్‌గా మరికొద్ది గంటల్లో మరిన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ని వెల్లడించనుండగా ఆ టైం కోసం ఎదరుచూస్తున్నారు.
ముఖ్యంగా ఇండియా టీవీ, సీఎన్బీసీ, ఇండియాటుడే- మైయాక్సిస్, చాణక్య, న్యూస్ 18, సీఎన్ఎన్ ఐబీఎన్, ఏబీపీ న్యూస్ నీల్సన్, టైమ్స్ నౌ, ఎన్డీటీవీ.. వంటి పలు జాతీయ మీడియా సంస్థలతో పాటు ఏపీ- తెలంగాణకు చెందిన ఆరా వంటి ఎన్నికల సర్వే సంస్థలు కూడా నేడు తమ అంచనాలను వెల్లడించబోతోన్నాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ పైన బిపి పెరిగిపోతుంది.