ఏపీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్దమైంది. జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా హై అలర్ట్ ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా ఇవాళ సాయంత్రం నుండి మద్యం షాపులు బంద్ కానున్నాయి.
33 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుండగా కౌంటింగ్ కు అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని నిర్థాక్షణ్యంగా బయటకు పంపడమే కాకుండా చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నిజిల్లాల ఎన్నికల అధికారులను ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతవాతావరణంలో పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుండగా తొలుత పోస్టల్ బ్యాలెట్, ఆ తరువాత ఈవీఎంల కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజంట్ ను నియమించుకునేందుకు, ఆర్వో టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఒక ఏజంట్ కు అవకాశం ఉంటుంది.