Friday, May 9, 2025
- Advertisement -

జగన్ మార్క్ ప్లాన్..ప్రతి నియోజకవర్గానికి!

- Advertisement -

వైసీపీ ఎంపీ,ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. ఇక రేపో,మాపో మేనిఫెస్టో కూడా రిలీజ్ కానుంది. దీంతో ఇక మిగిలింది ప్రచారమే.ఇందుకోసం జగన్ మార్క్ ప్లాన్‌తో ప్రజల్లోకి రానున్నారు వైసీపీ బాస్. సింహాం సింగిల్‌గా వస్తుందని ఇప్పటికే జనాల్లోకి తీసుకెళ్లిన జగన్‌…పక్కా ప్లాన్ తో ప్రచార పర్వాన్ని హోరెత్తించనున్నారు.

వైనాట్ 175 లక్ష్యంగా జగన్ ప్రచార పర్వం ఉండనుంది. ప్రధానంగా ఐదు సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం, మరోసారి అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు జగన్. ఇక గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేయగా ఈసారి మేనిఫెస్టో మరింత ప్రజాకర్షణగా ఉండనుంది.

ఎన్నికల క్యాంపెయిన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని రోజులు పర్యటించాలి, ఏ జిల్లాకు ఎప్పుడు, ఎక్కడ సభలు,రోడ్‌షోలు నిర్వహించాలని అన్నదానిపై పక్కా ప్లాన్‌తో వస్తున్నారు. 2019లో 151 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురగా ఈసారి అంతకుమించి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత జగన్ ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారుకానుంది.ప్రధానంగా ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించనున్నారు జగన్. మొత్తంగా జగన్‌ వేస్తున్న ఎత్తుగడలు ప్రతిపక్ష కూటమికి నిద్ర లేకుండా చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -