Friday, May 9, 2025
- Advertisement -

జగన్ ఎన్నికల శంఖారావం..అక్కడి నుండే

- Advertisement -

వైనాట్ 175 పేరుతో దూసుకుపోతున్నారు ఏపీ సీఎం జగన్‌. ఓ వైపు సిట్టింగ్‌ల మార్పు అదే సమయంలో పార్టీ క్యాడర్‌తో భేటీ..రెండంచెల వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు జగన్. ఇక ఈ నెల 25 నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు జగన్‌. రాష్ట్రాన్ని ఐదు జోన్‌లుగా విభజించి ప్రతీ జోన్‌లో కార్యకర్తలతో ముఖాముఖి, ఒక బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్‌ చేశారు. పార్టీ సభ్యులందరినీ ఏకంచేసి, వారిలో చైతన్యం నింపుతూ ఎన్నికలకు సమాయత్తం చేసేలా ఈ సమావేశాలు ఉండనున్నాయి.

ఇక తొలి సభ ఈ నెల 25న ఉత్తరాంధ్ర భీమిలిలో జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని చకచక జరుగుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఏర్పాట్లులలో బిజీ కాగా ప్రతి నియోజవర్గం ఐదు నుంచి ఆరు వేల మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉంది.

సీఎం జగన్‌కు ఉత్తరాంధ్రపై ప్రత్యేక శ్రద్ధ ఉందని అందుకే ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుండి మొదలు పెట్టనున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో వైసీపీ చేసిన అభివృద్ధిని ప్రజలకు చేర్చే విధంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీలో అసంతృప్తులు తొలగించడం, ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులకు గల కారణాలను సీఎం జగన్ నేరుగా కేడర్‌కు వివరించనున్నారు. మొత్తంగా భీమిలి నుండి జగన్ ఎన్నికల శంఖారావన్ని పూరించనుండగా వైసీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -