ఏపీకి మరో 30 సంవత్సరాలు జగనే సీఎం అన్నారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడిన పద్మనాభం..ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీలో చేరానన్నారు.నాకు కులం కాదు ముఖ్యం.. నాకు వర్గం ముఖ్యం అని ముద్రగడ స్పష్టం చేశారు.
పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని..బీజేపీ వాళ్లు తమ పార్టీలో చేరాలని సంప్రపదించారని కానీ వైసీపీలోనే చేరానని తెలిపారు. మా కుటుంబాలకు రాజకీయ బిక్ష పెట్టింది బీసీలు, దళితులు, కాలపులు ఐదుశాతం ఉంటారు…తాను రాజకీయాలకు రావడానికి కాపులు కారణం కాదు అని తెలిపారు.
తనపై సోషల్ మీడియాలో దుష్ప్రాచరం జరుగుతుందని…ఇకనైనా వారు తప్పుడు పోస్ట్‌లు ఆపాలన్నారు. తనకు రాజకీయ బిక్ష పెట్టింది ప్రత్తిపాడు ప్రజలు… కాపు ఉద్యమంలో ఎక్కువ మంది దళితులే ఉన్నారని చెప్పారు. సినిమాల్లోకి మొదట వచ్చింది నేను.. రాజకీయాల్లోకి మొదటి వచ్చిది నేనే అని చెప్పారు. వాళ్లు సినిమాల్లో హీరో కావచ్చు.. నేను రాజకీయాల్లో హీరో అంటూ పవన్‌కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. సినిమావాళ్లు ఆరు నెలలకు ఒక్కసారి వస్తారు.. ప్రజలు వారిని నమ్మరన్నారు.