టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు నాయడికి ఏసీబీ కోర్టులో షాకిచ్చింది.భద్రతా కారణాల నేపథ్యంలో హౌస్ రిమాండ్‌లో ఉంచాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో టీడీపీ శ్రేణులు తీవ్రనిరాశలో మునిగిపోయాయి.
ఇక హౌస్ మొషన్ పిటిషన్‌పై చంద్రబాబు భారీ ఆశలు పెట్టుకున్నారు. అంతేగాదు సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌పై క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ రేపు విచారణకు రానుండగా హౌస్ అరెస్ట్‌కు అనుమతించాలన్న దానిని కొట్టివేసింది న్యాయస్థానం. భద్రతా కారణాల నేపథ్యంలో హౌస్ రిమాండ్‌లో ఉంచాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించిన చంద్రబాబు తరపు న్యాయవాదుల పిటిషన్‌ను తిరస్కరించింది.
చంద్రబాబు తరఫు న్యాయవాదులు చూపిన భద్రతా కారణాలను చూపుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్ధానం రాజమండ్రి సెంట్రల్ జైలులో ముప్పులేదన్న సీఐడీ వాదనలతో ఏకీభవించింది. దీంతో చంద్రబాబుకు రిమాండ్ తప్పేలా కనిపంచడంలేదు. కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడంతో తదుపరి చర్యలపై కసరత్తు చేస్తున్నారు బాబు న్యాయవాదులు.
ఇక చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీ అవసరం ఏంటో చెబుతూ పిటిషన్ దాఖలు చేయగా.. వాదనలు రేపటి వాయిదా వేసింది. దీంతో చంద్రబాబు ఎపిసోడ్‌లో మరింత సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది.