ఏపీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది జగన్ సర్కార్. ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ని ప్రవేశ పెట్టారు. రూ. 2లక్షల 86వేల 389 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించామని చెప్పారు. మొదటి మూడు, నాలుగు నెలల కాలానికే బడ్జెట్ ఆమోదం తెలపగా ఎన్నికల తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
()రూ.2లక్షల 86వేల 389కోట్లతో వార్షిక బడ్జెట్.
()రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లు
()మూలధన వ్యయం రూ.30వేల 530 కోట్లు.
()ద్రవ్యలోటు రూ.55 వేల 817కోట్లు.
()రెవెన్యూ లోటు రూ.24వేల 758 కోట్లు.
()వైఎస్ఆర్ పెన్షన్ రూ.3 వేలకు పెంపు, 66.35లక్షల మందికి పెన్షన్
()పెన్షన్లకు ఐదేళ్లలో 84,731కోట్లు ఖర్చు చేశాం
()9260 వాహనాల ద్వారా ఇంటికే రేషన్ పంపిణీ
()వైఎస్ఆర్ బీమా కోసం రూ. 650 కోట్లు ఖర్చు
()బీసీ నేస్తం కోసం రూ. 1257కోట్లు పంపిణీ
()కల్యాణ్ మస్తు, షాదీ తోఫా కోసం రూ. 350కోట్లు పంపిణీ
()కాపునేస్తం కోసం రూ. 39,247 కోట్లు పంపిణీ
()నేతన్న నేస్తం కోసం రూ. 983 కోట్లు
()జగనన్న తోడు కింద రూ. 3374 కోట్లు
()జగనన్న చేదోడు కోసం రూ. 1268 కోట్లు
()వాహన మిత్ర కోసం రూ. 1305 కోట్లు
()బీసీ సంక్షేమం కోసం రూ. 71,170 కోట్లు ఖర్చు
()బీసీలకు 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు
()1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలు.
()2.6లక్షల మంది వలంటీర్ల నియామకం
()రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78కి పెంపు
()ప్రతీ జిల్లాలో దిశ పీఎస్ లను ఏర్పాటు
()13 నుంచి 26 జిల్లాలకు జిల్లాల పెంపు.
()రూ. 3,367 కోట్లతో విద్యాదీవెన కిట్టు.
()47లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక
()ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఐబీ విద్యావిదానం.
()మనబడి – నాడు నేడులో 99.81శాతం స్కూళ్లలో మౌలిక వసతులు.
()77 గిరిజన మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం.
()ఉచితంగా విద్యార్థులకు 9,52,925 ట్యాబ్స్
()34లక్షల మంది విద్యార్థులకు ఉపయోగం
()బోధనా ఆసుపత్రులకు 16,852 కోట్లు ఖర్చు.
()నిర్విరామగా 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.
()వైఎస్సార్ ఆరోగ్యశ్రీ రూ.25లక్షలకు పెంపు.
()ఆరోగ్యశ్రీ పథకంలో వ్యాధులను 3257కు పెంపు.
()2019-23 మధ్య ఆరోగ్యశ్రీ ద్వారా 35.91లక్షల మందికి లబ్ధి.
()కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం.
()పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు.
()జగనన్న ఆరోగ్య సురక్ష కింద 10,754 శిబిరాలు
()కోటీ 67లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు
()53,126 మంది ఆరోగ్య సిబ్బంది నియామకం.
()ఏపీలో 192 స్కిల్ హబ్ లు, 27 స్కిల్ కాలేజీ స్థాపించడం జరిగింది.
()10,778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు.
()ఉచిత వ్యవసాయ విద్యుత్ పై 37,374కోట్లు సబ్సిడీని అందించాం.
()3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు
()127 కొత్త వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
()10 ఫిషింగ్ హార్బర్ ల నిర్మాణం