నాలుగోసారి ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు చంద్రబాబు. ఇప్పటికే బాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణస్వీకారం చేయనుండగా 24 మందితో బాబు కేబినెట్ ఉండనుంది.
జనసేన నుంచి కేబినెట్ లో పవన్ క, నాదెండ్ల మనోహర్,కందుల దుర్గేష్ చోటు దక్కించుకోగా బీజేపీ నుంచి సత్యకుమార్ ఒక్కరికే అవకాశం దక్కింది.
నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి), కొణిదెల పవన్ కళ్యాణ్, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారధి,
డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి ఉన్నారు.
అలాగే కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్థన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, నారా లోకేశ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.