Thursday, May 8, 2025
- Advertisement -

ఏపీ కేబినెట్ భేటీ..

- Advertisement -

ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో జరిగే ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్‌పై చర్చించనున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి కేబినెట్ సమావేశం ఇది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీపై చేయగా తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, పింఛను మొత్తం రూ. 4వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై సంతకాలు చేశారు.

ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో వీటికి అమోదం తెలపడంతో పాటు పొలవరం, అమరావతి రాజధాని వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే జూలైలో ప్రవేశ పెట్టే బడ్జెట్‌ అంశాలపై చర్చించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -