ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముసాయిదా ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అమరావతిలో నూతన అసెంబ్లీ భవన నిర్మాణానికి రూ.617 కోట్లు, హైకోర్టు భవన నిర్మాణానికి రూ.786 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ నిర్మాణ పనులను తక్కువ ధరను కోట్ చేసిన ఎల్1 బిడ్డర్‌కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిద్వారా నగర ప్రాంతాలలో వరదల తీవ్రత తగ్గించేందుకు ప్రత్యేక వరద నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
()విశాఖపట్నంలోని ఐటీహిల్-3 ప్రాంతంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థకు 21.66 ఎకరాల భూమిని కేటాయించింది.
()ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 3.5 ఎకరాల భూమిని కేటాయించారు
() విశాఖపట్నం సమీపంలోని కాపులుప్పాడలోని 56 ఎకరాల భూమిని ఉరుస క్లస్టర్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
()బలిమెల మరియు జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద నిర్మించాల్సిన హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టుల విషయంలో ఒడిశా పవర్ కన్సార్టియమ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
()వివిధ ప్రాంతాలలో పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా మంత్రివర్గం అనుమతి తెలిపింది.