ప్రముఖ ఆన్‌లైన్ డెలివరీ సంస్థ స్విగ్గీ కొత్త యాప్‌ను ప్రారంభించి కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సేవలందించిన స్విగ్గీ…తాజాగా హెల్త్ రంగంలోకి అడుగుపెట్టింది. పింగ్(pyng) పేరుతో హెల్త్, వెల్‌నెస్, ఆస్ట్రాలజీ, ఈవెంట్ ప్లానింగ్ వంటి రంగాల్లో ఇకపై సేవలు అందించనుంది.
ఇందుకోసం వివిధ రంగాల నిపుణులు, ప్రజలను కలిపే టార్గెట్‌గా కొత్త యాప్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రజలు తమకు అవసరమైన ప్రొఫెషనల్స్‌తో సులభంగా కనెక్ట్ అవ్వవచ్చని చెప్పారు.
ప్రస్తుతం ఈ సర్వీస్ బెంగళూరు ప్రజలకు అందుబాటులో ఉండగా త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనుంది. దేశం నలుమూలల నుండి కనీసం 10 వేల మంది నిపుణులను చేర్చుకునే దిశగా స్విగ్గీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ట్రైనర్లు, యోగా ఇన్‌స్ట్రక్టర్లు, పోషకాహార నిపుణులు, థెరపిస్టులు, ఇన్వెస్ట్‌మెంట్ కన్సల్టెంట్లు, జ్యోతిష్కులు పింగ్ ద్వారా అందుబాటులో ఉండనున్నారు.
