40 ఇయర్స్ ఇండస్ట్రీ..అవును కానీ సాధించిన మెడికల్ కాలేజీలు శూన్యం. ఎందుకంటే తానే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీని హైదరాబాద్‌కు తీసుకువచ్చానని బిల్డప్ ఇచ్చే చంద్రబాబు సాధించిన వైద్య కళాశాలలు మాత్రం శూన్యం. ఎందుకంటే చెప్పే ప్రతీమాట బిల్డపే.
పేరుకే 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. కానీ.. ప్రజారోగ్యం విషయంలో చంద్రబాబు ఇప్పటి వరకు చేసింది శూన్యం. ఎందుకంటే వైఎస్ జగన్ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా.. ఇందులో 5 కాలేజీలు గత ఏడాది ప్రారంభమైపోయాయి, మరో ఐదు కాలేజీల నిర్మాణం 80% పూర్తయ్యింది.
కానీ చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టింది లేదు. అయితే ఇప్పుడు ఆ 17 కాలేజీల్లోని 5 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు రాకుండా చంద్రబాబు లేఖలు రాస్తూ అడ్డుపడుతున్నాడు. రాష్ట్రానికి మంచి జరుగుతుంటే ఇలా అడ్డుపడే దుర్మార్గమైన ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా ఉండరేమో?నని ప్రజలు మండిపడుతున్నారు.