- Advertisement -
ఎన్నికల వేళ ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్న జగన్..తాజాగా వీఆర్ఏలకు గుడ్ న్యూస్ చెప్పారు. గత ప్రభుత్వంలో నిలుపుదల చేసిన డీఏను రూ.300 నుంచి రూ.500కు పెంచుతూ శుభవార్తను అందించారు.
శుక్రవారం నుంచి పెంచిన డీఏ అమల్లోకి వస్తుందని తెలిపింది. జగన్ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులకు 20 శాతం ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని, పీఆర్సీ, డీఏ బకాయిలు సైతం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
ఇక వచ్చేవారం మంత్రులతో సమావేశం ఉందని ఆ సమావేశంలో ఐఆర్ ప్రకటన సహా పలు డిమాండ్లపై ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఐఆర్ ఇస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఇక జగన్ నిర్ణయంతో వీఆర్ఏలు హర్షంవ్యక్తం చేశారు.