విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు ఏపీ సీఎం జగన్. ఇక జగన్ విదేశాల్లో ఉండగానే టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. 14 రోజుల రిమాండ్‌లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు బెయిల్ దొరకడం కష్టమే. ఇక ఈ కేసులో నేరం రుజువైతే చంద్రబాబుకు 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా లైఫ్ టైం పడే అవకాశం ఉంది. ఇక సీఐడీ దూకుడు చూస్తుంటే బాబుపై మరిన్ని కేసులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక బాబు అరెస్ట్ వెనుక జగన్,మోడీ,అమిత్ షాలకు తెలిసే జరిగిందని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి టీడీపీ నేతలు విమర్శించేంది తన సొంత కేసుల గురించి మాట్లాడేందుకేనని. కానీ ఇప్పుడు జగన్ ఢిల్లీ టూర్ అనగానే టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎందుకంటే టీడీపీ బాస్ ఇప్పుడు జైళ్లో ఉన్నారు. అందుకే ఇప్పుడు జగన్ హస్తినకు అనగానే బాబుకు మళ్లీ ఏకష్టం ముంచుకోస్తుందోనని మదన పడుతున్నారు.
ఇప్పటికే జగన్…ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ అడిగినట్లు తెలుస్తోంది. అపాయింట్‌మెంట్ కన్ఫామ్ అయితే వెంటనే ఢిల్లీ వెళ్లనున్నారట జగన్. టీడీపీ నేతలు సైతం జగన్ ఇలాంటి సందర్భంలో ఎలాంటి కారణం లేకుండానే ఢిల్లీకి వెళ్లరని భావిస్తున్నారు. ఒకవేళ జగన్ హస్తిన టూర్ కన్ఫామ్ అయితే బాబు అండ్ కో కు మరింత ఇబ్బందులు తప్పవని అంతా భావిస్తున్నారు.ఏదిఏమైనా చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయనే చెప్పొచ్చు.