- Advertisement -
ఏపీ ఎన్నికల సమరం ముగిసింది. జూన్ 4న ఫలితాలు విడుదల కానుండగా గెలుపెవరిది అనే దానిపై అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్నికల క్షేత్రంలో అవిశ్రాంతంగా శ్రమించిన సీఎం జగన్ ఇవాళ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
ఫ్యామిలీతో కలిసి రాత్రి 11 గంటలకు విజయవాడ నుండి తొలుత లండన్ వెళ్తారు. జూన్ 1 వరకు ఆయన లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. జూన్ 1న తిరిగి ఏపీకి రానున్నారు జగన్.
జగన్ విదేశీ పర్యటనకు ఇటీవల హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. జగన్ గతంలోనూ పలుసార్లు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో పర్యటించారు. జగన్ పాలిటిక్స్‌కు ఎంత ప్రియార్టీ ఇస్తారో కుటుంబ సభ్యులకు అంతే ఇంపార్టెన్స్ ఇస్తారన్న సంగతి తెలిసిందే.