Saturday, May 10, 2025
- Advertisement -

ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయం!

- Advertisement -

ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ వైపు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తూనే మరోవైపు కీలక సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలకు పరిష్కారం దిశగా ముందుకు కదిలారు.

డాక్టర్ వైఎస్ఆర్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు ప్రారంభోత్సవం, పలాస కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం చేపట్టారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఉద్దానం అంటే గుర్తుకొచ్చేది కిడ్నీ సమస్యే. మూడున్నర దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఈ సమస్య మరింత ఎక్కువ కాగా పట్టించుకున్న పాపాన పోలేదు.

అయితే ప్రజా సంకల్ప యాత్రలో ఉద్దానం ప్రాంత ప్రజల సమస్యలను విన్న జగన్ వారికి భరోసానిచ్చారు. ఇందులో భాగంగా రూ.700 కోట్లతో చేపట్టిన డాక్టర్ వైయ‌స్ఆర్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు సీఎం జగన్. తర్వాత పలాస చేరుకుని కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు.

హీరమండలం జలాశయం నుండి 1.12 టీఎంసీల నీటి సరఫరాతో, 1000 కిలోమీటర్ల పైపు లైన్ల నిర్మాణం ద్వారా వజ్రపు కొత్తూరు, పలాస, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్చాపురం మండలాలతో పాటు మేలియాపుట్టి, పాతపట్నం ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ఒక్కొక్కరికి 100 లీటర్ల చొప్పున రక్షిత మంచినీటిని అందించేందుకు ఈ పథకాన్ని చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -