Thursday, May 8, 2025
- Advertisement -

ఏపీ సీఎం జగన్‌ మరో గుడ్ న్యూస్..

- Advertisement -

జగన్ సర్కార్‌ పేదల సర్కార్ అని మరోసారి నిరూపించుకుంది. గతంలో ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయగా ఈ నెల 27 నుండి పేదలకు అందించిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయాలని భూ పరిపాలన శాఖ అధికారులను ఆదేశించింది. ఈ నెల 27 నుండి ఫిబ్రవరి 9 వరకు ఈ రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.

బయోమెట్రిక్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరపాలని.. సర్వే, ప్లాట్‌ నంబర్లు, పేర్లు, ఇతర వివరాల నమోదులో తప్పులు దొర్లకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది ప్రభుత్వం. రాష్ట్రంలో 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది జగన్ సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా 17 వేలకుపైగా వైఎస్సార్‌ జగనన్న కాలనీలు నిర్మించింది. ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా అసైన్డ్‌ భూముల చట్టాన్ని సవరించింది.పట్టాలు పొందిన వారికి ఆ స్థలాలను రిజిస్టర్‌ చేయనుంది.

ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మవుతుంది. రిజిస్ట్రేషన్‌ పూర్తవగానే అర్హులకు కన్వేయన్స్‌ డీడ్‌లను పంపిణీ చేయనున్నారు. వీఆర్‌వోలు సచివాలయాల్లోనే అందుబాటులో ఉండేలా చూసే బాధ్యతను తహశీల్దార్లకు అప్పగించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -