ఎన్నికల వేళ ఏపీ సీఎం జగన్ మరో సరికొత్త పథకంతో ప్రజల ముందుకు వచ్చారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో కొత్త స్కీంను తీసుకురాగా ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యర్థుల కోసం ప్రభుత్వం జగన్న సివిల్ సర్వీసెస్ అనే కొత్త పథకాన్ని పెట్టారు. యూపీఎస్సీ నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి రూ.లక్ష, మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి రూ. 50 వేలు చొప్పున నగదు ప్రోత్సాహం అందిస్తారు.
జ్ఞానభూమి పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా 2023 పరీక్షల్లో అర్హత సాధించిన వారు మాత్రమే అర్హులు. ప్రతి ఏటా ఏపీ నుండి 40 మంది యూపీఎస్సీకి ఎంపికవుతున్నారు. ఇక తాజాగా జగన్ తీసుకు వస్తున్న ఈ స్కీంతో సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాల అభ్యర్థులు మరింత మంది యూపీఎస్సీకి అర్హత సాధించే అవకాశం ఉంది.