Saturday, May 10, 2025
- Advertisement -

ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం..

- Advertisement -

ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు స్పీకర్‌, మండలి ఛైర్మన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. రెబల్ ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి,ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, సీ రామచంద్రయ్య యాదవ్‌పై ఫిర్యాదు చేసింది వైసీపీ.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ విప్‌ను ధిక్కరించి వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేశారు. ఇటీవలె ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో కలిసిన సంగతి తెలిసిందే. దీంతో వీరిపై వేటు వేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు.

జగన్ తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు ఏపీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. సిట్టింగ్‌ల మార్పు, అభ్యర్థుల ఛేంజ్‌ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -