Saturday, May 10, 2025
- Advertisement -

సీఎం జగన్ మరో కీ మూవ్..అసెంబ్లీకి కీలక నేతలు!

- Advertisement -

ఏపీ సీఎం జగన్ వరుస సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగుతున్నారు. ఇప్పటికే పలు స్థానాలకు కొత్త ఇంఛార్జీలను నియమించగా తాజాగా మరో ఇద్దరు కీలక నేతలను అసెంబ్లీ బరిలో దించేందుకు కసరత్తు చేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ మార్గాని భరత్‌లను అసెంబ్లీకి పోటీచేయించనున్నారట.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీచేయనున్నారు. గతంలో ఇక్కడి నుండి రెండు సార్లు విజయంసాధించారు సుభాష్ చంద్రబోస్. ప్రస్తుతం ఈ నియోజవర్గం నుండి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్‌కు మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక రాజమండ్రి అర్బన్ నుండి ఎంపీ మార్గాని భరత్‌ బరిలో ఉండే అవకాశాలున్నాయి. రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ రెండు టీడీపీ సిట్టింగ్ స్థానాలు. అలాగే మండపేట నుండి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును టీ చేయిస్తారని టాక్. మొత్తంగా పలుస్థానాలకు అభ్యర్థులను మార్చడం ద్వారా వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే స్థానాలు పెరిగే అవకాశం ఉందని జగన్ అంచనా వేస్తున్నారు. ఇక అభ్యర్థుల మార్పు నేపథ్యంలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -