- Advertisement -
వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి షాకిచ్చారు మండలి ఛైర్మన్. జంగాపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ నేతల ఫిర్యాదుతో పలుమార్లు జంగా నుంచి వివరణ తీసుకున్న మండలి ఛైర్మన్…ఆయన ఇచ్చిన వివరణ ఆధారంగా ఎమ్మెల్సీగా కృష్ణమూర్తి అనర్హుడని పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
జంగా కృష్ణమూర్తి 2009 నుంచి 2019 వరకు పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైసీపీ జంగాను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది. కొద్ది రోజుల తర్వాత వైసీపీని వీడి టీడీపీలో చేరారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు మండలి ఛైర్మన్.