Saturday, May 3, 2025
- Advertisement -

ఏపీ లిక్కర్..తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమే

- Advertisement -

మద్యం విషయంలో తప్పు చేసినట్లయితే ఏ శిక్షకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతలపై దాడులు పెరిగిపోయాయన్నారు. భారీ ఆశలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు పేదల కడుపు కొట్టారని మండిపడ్డారు.

గెలిచినప్పుడు ఓడిపోయిన వారిని ఇబ్బదులకు గురిచేయడం తగదని ….కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రజాస్వామ్యం ఖూనీ చేశారన్నారు.తనకు ఎవరైనా డబ్బులు ఇచ్చారని నిరూపిస్తే ఉరివేసుకుని చస్తానని సంచలన కామెంట్స్ చేశారు. నా కుమార్తె ఓడిపోవడానికి గల కారణాలు నేను చెప్పదల్చుకోలేదన్నారు.

మదనపల్లి ఆర్డీవో ఆఫీసులో రికార్డులు తగలపెట్టారు.. అయినా అవన్నీ ఆన్ లైన్‌లో ఉంటాయని… రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అన్నారు. చంద్రబాబు తన సామాజిక వర్గం ద్వారానే విజయం సాధించగలిగారని…చంద్రబాబు పెట్టిన మద్యం బ్రాండ్లు ఇప్పుడు కొనసాగుతున్నాయి. వాసుదేవరెడ్డి దగ్గర నేను కీలుబొమ్మగా బ్రతకాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -