Friday, May 9, 2025
- Advertisement -

ఏపీ ఓటర్ల.. తుది జాబితా రిలీజ్

- Advertisement -

ఓటర్ల జాబితాపై ఏపీలో రచ్చరచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఓటర్ల జాబితాలో రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న వారిని తొలగించాలని వైసీపీ, అర్హుల ఓట్లు తొలగిస్తున్నారని టీడీపీ ఒకరిపై ఒకరు ఫిర్యాదుల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం పూర్తి కావడంతో తుది జాబితాను రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం.

అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లాల వారీగా ఎన్నికల సంఘం వెబ్ సైట్లో వివరాలను అందుబాటులో ఉంచారు. వీటిలో తాజాగా ఓటు నమోదు చేసుకున్న వారు, మార్పులు చేర్పులు చేసుకున్న వారు పరిశీలించుకునే అవకాశం లభించింది.

రాష్ట్రంలో నకిలీ ఓట్ల నమోదు, అసలు ఓట్ల తొలగింపు పై వైసీపీ, టీడీపీ మధ్య ఓ యుద్ధం జరిగినంత పని కాగా వీటిలో ఈసీ ఎన్ని ఫిర్యాదులను పరిశీలించి మార్పులు చేసిందో త్వరలో తేలనుంది. ఇక కలెక్టర్లు విడుదల చేసిన జాబితాలను పరిశీలించిన తర్వాత పొలిటికల్ పార్టీలు స్పందిచే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -