- Advertisement -

పవన్ సినిమాల్లో నటించకుండా పిటిషన్!

- Advertisement -

పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడంపై దాఖలైన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ దాఖలు చేసిన మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్‌పై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

పిటిషన్‌లో, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ‘Hari Hara Veera Mallu’ సినిమాలో నటించడం అనైతికమని పేర్కొన్నారు. అలాగే సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.

అయితే ఈ వాదనలను ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్ ఖండించారు. గతంలో ఎన్టీఆర్‌కు సంబంధించిన కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరణగా చూపుతూ, టికెట్ ధరల పెంపుకు పవన్ కళ్యాణ్‌కు సంబంధం లేదని వాదించారు.

ఈ వాదనలు పరిశీలించిన హైకోర్టు, పిటిషన్‌లో సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ దానిని కొట్టివేసింది. అంతేకాకుండా కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు పిటిషనర్‌పై ఖర్చులు విధించాలని ఆదేశించింది. మొత్తానికి, ఈ తీర్పుతో రాజకీయ నాయకులు సినిమాల్లో పాల్గొనడంపై ఉన్న వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్టైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -