- Advertisement -
వైసీపీ ఆఫీస్‌ల కూల్చివేతపై తొందరపాటు వద్దని ఏపీ ప్రభుత్వానికి, అధికారులకు సూచించింది ఏపీ హైకోర్టు. వైసీపీ పార్టీ కార్యాలయ భవనాల కూల్చివేత వ్యవహారంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. అలాగే భవనాలకు అనుమతులకు సంబంధించిన పత్రాలను అన్నీ రెండు వారాల్లో సమర్పించాలని వైసీపీ తరఫున పిటిషనర్లకు సూచించింది.
వైసీపీ ఇచ్చే వివరణను కూడా పరిగణనలోకి తీసుకోవాలని…ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగితే తప్ప.. ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. నిబంధనల్లో పేర్కొన్న విధంగా అవసరమైన ప్రతీ దశలోనూ పిటిషనర్లు తమ వాదనలు చెప్పుకొనేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేసింది.
నిర్మాణాలు ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా, స్థానికులకు ప్రమాదకరంగా ఉన్నప్పుడు మాత్రమే కూల్చివేత ప్రక్రియ చేపట్టాలని అధికారులకు స్పష్టం చేసింది.