- Advertisement -

ఏపీ ఇంటర్ ఫలితాలు..బాలికలదే పైచేయి

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్‌లైన్ వేదికగా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది కూడా బాలుర కంటే బాలికలే మెరుగైన ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేయడం విశేషం.

ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలు

మొదటి సంవత్సరంలో మొత్తం 77 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

హాజరైన వారు: 4,71,864 మంది

ఉత్తీర్ణత సాధించిన వారు: 3,61,526 మంది

బాలికల ఉత్తీర్ణత: 81%

బాలుర ఉత్తీర్ణత: 72%

ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు..

రెండో సంవత్సరంలో మొత్తం 81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

హాజరైన వారు: 4,46,537 మంది

ఉత్తీర్ణత సాధించిన వారు: 3,59,816 మంది

బాలికల ఉత్తీర్ణత: 85%

బాలుర ఉత్తీర్ణత: 76%

ఒకేషనల్ విభాగంలో కూడా విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు.ప్రథమ సంవత్సరం: 38,443 మంది హాజరు కాగా, 23,569 మంది (61%) ఉత్తీర్ణులయ్యారు.
ద్వితీయ సంవత్సరం: 33,852 మంది హాజరు కాగా, 25,151 మంది (74%) ఉత్తీర్ణత సాధించారు.

విద్యార్థులు తమ మార్కుల జాబితాను ఈ క్రింది వెబ్‌సైట్ల ద్వారా పొందవచ్చు..

bie.ap.gov.in

resultsbie.ap.gov.in

ఏపీ ప్రభుత్వ ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009 కు “Hi” అని మెసేజ్ చేయడం ద్వారా కూడా మీ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10.57 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి అభినందనలు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -