Friday, May 9, 2025
- Advertisement -

మద్యం మాఫియాదే రాజ్యం!

- Advertisement -

ఏపీ లిక్కర్ షాపుల వేలంలో ఎల్లో సిండికేట్‌ మాయాజాలం స్పష్టంగా కనిపించింది. మెజార్టీ షాపులను పచ్చపార్టీల నేతలే దక్కించుకోగా మద్యం దుకాణాలు దక్కని షాపుల్లోనూ టీడీపీ నేతలు దౌర్జన్యకాండ చేస్తున్నారు.

లాటరీ ప్రక్రియను పచ్చ పార్టీ నేతలు హైజాక్ చేయగా దాదాపు 80 శాతం మద్యం షాపుల లైసెన్స్‌లు కూటమి నేతలకే దక్కాయి. మద్యం దుకాణాలన్నీ సిండికేట్ మాఫియా చేతుల్లోకి.. లాటరీలో దొరకని షాపుల కోసం అప్పుడే బెదిరింపులు మొదలయ్యాయి.

మిగితా 20 శాతం షాపులను తమ ఖాతాల్లో వేసుకునేందుకు టీడీపీ నేతలు దౌర్జన్యకాండ మొదలు పెట్టారు. లాటరీ ప్రక్రియ పూర్తి కావడంతో ఇక రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని ఏరులై పారించేందుకు సిద్ధమవుతోంది లిక్కర్ మాఫియా. ఏపీలో శాంతి భద్రతలు మరింతగా క్షీణించే ప్రమాదం ఉన్నా చోద్యం చూస్తున్నారు చంద్రబాబు. ఇక లిక్కర్ షాపుల వేలంలో అత్యధికంగా తిరుపతి జిల్లాకు కేటాయించింది ప్రభుత్వం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -