Tuesday, May 6, 2025
- Advertisement -

నారా వారి లిక్కర్ పాలసీ..పారదర్శకత ఏది?

- Advertisement -

ఏపీ లిక్కర్ పాలసీపై ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదేనా బాబుగారి పారదర్శకత? అని ప్రశ్నిస్తున్నారు సామాన్యులు. బెదిరించి.. భయపెట్టి మద్యం దుకాణాలను సొంతం చేసుకుంటున్నారు టీడీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతి పరులు. అంతేగాదు మద్యం టెండర్లు వేయడానికి వస్తున్న వారిపై బెదిరింపులు, దౌర్యన్యానికి సైతం వెనుకాడటం లేదు.

అనంతపురం జిల్లాలో వైన్ షాపులన్నీ తమవారికేనని పబ్లిక్ గానే చెబుతున్నారు జేసీ బ్రదర్స్. ఏలూరులో పోలీసులపైనే దౌర్జన్యానికి దిగారు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు. ధర్మవరంలో మద్యం దుకాణాలను తన సన్నిహితుడికి కట్టబెట్టారు మంత్రి సత్యకుమార్. మద్యం దుకాణాల కోసం లాటరీ తీసే ప్రక్రియ ఒక ఫాల్స్ అని అంతా ఆరోపిస్తున్నారు.

గతంలో చంద్రబాబు పాలనలో జరిగినట్లుగానే ఇప్పుడూ జరుగుతోంది. 2014 నుండి 2019 వరకు ఏపీలో మద్యం ఏరులై పారింది. చంద్రబాబు సన్నిహితులకు చెందిన నాలుగు కంపెనీలకే 70 శాతం లిక్కర్ ఆర్డర్లు కట్టబెట్టారు చంద్రబాబు. అంతేగాదు 43,000 వేల బెల్టు షాపులను విస్తరించిన చరిత్ర కూడా చంద్రబాబుదే. అయితే ఏపీని క్రమక్రమంగా మద్యం రహిత రాష్ట్రంగా మార్చాలని బెల్ట్ షాపులన్నింటిని రద్దు చేశారు జగన్. అంతేగాదు మద్యం దుకాణాల సంఖ్యను సైతం 4,380 నుంచి 2,934కు (33%) కుదించారు. బార్ల సంఖ్య 840 నుంచి 530కి (40%) తగ్గించారు. మద్యం దుకాణం పక్కనే ఉండే పర్మిట్ రూమ్ లు తొలగించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా పారదర్శకంగా విక్రయాలు జరిపారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి పాతరోజులు వచ్చేశాయి. మద్యం దుకాణాల కోసం పబ్లిక్ గా బరితెగించి టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -