- Advertisement -

చంద్రబాబు ఆదాయ వనరు మైన్, వైన్!

- Advertisement -

రాష్ట్రంలో లిక్కర్ సిండికేట్‌ తయారైందని మండిపడ్డారు వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్. మీడియాతో మాట్లాడిన భరత్..సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లింది దేనికి?,ఏం మాట్లాడటానికి వెళ్లారు?, విజన్‌ 2047 అని అబద్ధాలు చెప్పడానికా? అని ప్రశ్నించారు. భారత దేశ ఎకానమీ 3.1 ట్రిలియన్‌ డాలర్స్‌ అయితే….ఏపీలో 2.3 ట్రిలియన్‌ డాలర్ ఎకానమీ చేస్తానని ప్రధానితో సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం అని ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారా? ఉచిత ఇసుక ఎవ్వరికీ ఇవ్వడం లేదు..గతంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వచ్చేది అన్నారు. ఇసుక కష్టపడి తవ్వి తీస్తున్న కూలీలకు బదులు ఆదాయం అంతా టీడీపీ నేతల జేబుల్లోకి పోతోందని… చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుగా మైన్‌, వైన్‌ అని ఎద్దేవా చేశారు.

సంపద సృష్టిస్తాం అని చంద్రబాబు చెప్పింది రాష్ట్రానికి కాదు తమ పార్టీనేతలకు అన్నారు. రాష్ట్రంలో లిక్కర్ సిండికేట్‌ తయారైంది…తెలంగాణాలో 2,600 మద్యం దుకాణాల కోసం లక్షా ముప్పై ఐదు వేల టెండర్లు పడ్డాయి అంటే ఒక షాపుకు యావరేజ్‌గా 50 టెండర్లు పడ్డాయి..కానీ ఏపీలో మాత్రం 3400 షాపులకు 9వేల టెండర్లు కూడా పడలేదు అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నది కూటమి ప్రభుత్వ నాయకులే అని మండిపడ్డారు.

పత్రికలో వచ్చేదాకా ఇసుక మాఫియా గురించి చంద్రబాబుకు తెలియదా?, అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటున్నామంటూ పట్టుకునేవి ఎద్దుల బండ్లు, తరలించేవి భారీ లారీలు..ఇందులో పోలీసులు కూడా భాగస్వాములయ్యారు.. చంద్రబాబుకు చేతకావడం లేదా. వాళ్ల పార్టీ నేతలే ఆయన కంట్రోల్‌లో లేరా, లేక వాళ్లకు చంద్రబాబుకూ అగ్రిమెంటా? ప్రతి ట్రక్కుపై చంద్రబాబు, లోకేశ్‌కు పర్సంటేజ్ వస్తోందా? అని ప్రశ్నించారు భరత్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -