ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్ కేంద్రాల వద్ద రాజకీయ నాయకుల హడావుడి, ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే ఈ హడావుడిలో చోటుచేసుకున్న ఒక ఫన్నీ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన ఒక టీడీపీ మహిళా అభ్యర్థి చేసిన హడావుడి నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది.
చిత్తూరు జిల్లాలో స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఒక ఆసక్తికర దృశ్యం కెమెరాకు చిక్కింది. టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు ఒక మహిళా అభ్యర్థి అక్షరాలా వాకర్ (Walker) సహాయంతో అతి కష్టమ్మీద నడుచుకుంటూ నామినేషన్ కేంద్రం వద్దకు వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్నారేమో అని అక్కడున్నవారంతా ఆమెను చూసి జాలిపడ్డారు.
కానీ అసలు అసలు కామెడీ ఆ తర్వాతే మొదలైంది! ఆ అభ్యర్థిని లైవ్‌లో కవర్ చేస్తున్న సమయంలో, వెనుక నుంచి ఓ వ్యక్తి అనుకోకుండా ఆమెను కొంచెం కదిలించాడు. అంతే.. భయంతో ఆమె ఒక్కసారిగా తన అనారోగ్యాన్ని, వాకర్‌ను పూర్తిగా మర్చిపోయారు! వాకర్‌ను వదిలేసి పరగెత్తేందుకు క్షణంలో సిద్ధమయ్యారు. ఆ తర్వాత వెంటనే తేరుకుని, తాను నటించాల్సిన ‘అనారోగ్య డ్రామా’ను గుర్తించి.. మళ్లీ పక్కనే ఉన్న వాకర్‌ను పట్టుకుని కుంటుతూ ముందుకు కదిలారు.
ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఇది నిజంగా మెడికల్ మిరాకిల్ బాసూ.. నామినేషన్ వేయగానే నడక వచ్చేసింది!”, “ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ అంటూ” రకరకాల ఫన్నీ కామెంట్లు చేస్తూ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఎన్నికల వేళ రాజకీయ నాయకుల ఈ వింత చేష్టలు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి.

