ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత లైంగిక దాడి విషయాన్ని ప్రస్తావిస్తూ పవన్‌కళ్యాణ్‌ను విమర్శించారు రోజా. పవన్‌కళ్యాణ్ అనబడే ఉప ముఖ్యమంత్రి గారూ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసిన రోజా.. దేవుడు తమరికి పుట్టుకతో బుద్ధి జ్ఞానం ఇచ్చి ఉంటే దాన్ని కాస్త ఉపయోగించండి స్వామి అంటూ విరుచుకపడ్డారు.
ఈ నేపథ్యంలో రోజా ట్వీట్‌పై స్పందించారు పవన్. పిఠాపురానికి చెందిన బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద నిన్న సాయంత్రం జరిగిన అఘాయిత్యం బాధ కలిగిందన్నారు. స్థానికులు అప్రమత్తమైన నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించారని తెలిపారు పవన్.
ఈ అమానుష చర్యను సభ్యసమాజంలోని ప్రతి ఒక్కరు ఖండించాలని..ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించాను అని చెప్పారు. బాధితురాలిని ఆదుకోవడంతో పాటు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాం అని వెల్లడించారు పవన్.
పవన్ కళ్యాణ్ అనబడే ఉప ముఖ్యమంత్రి గారూ…మీరు పంచె ఎగ్గాట్టాల్సింది… గుడి మెట్ల పై కాదు…విజయవాడ వరద బాధితుల కోసం అని ట్వీట్ చేశారు రోజా. మీరు ధర్మం ధర్మం అని అరవాల్సింది … నడి రోడ్డు పై కాదు…వైజాగ్ స్టీల్ కార్మికుల కోసం,మీరు గొడవపడాల్సింది… మతాల కోసం కాదు…నీట మునిగి… సాయమందని పేదల కోసం అన్నారు. మీరు కడగాల్సింది… మెట్లను కాదు…ఇసుక లేకుండా చేస్తున్న మీ నాయకుల అవినీతిని అని ప్రశ్నించారు.
మీరు బొట్లు పెట్టాల్సింది … గుడి మెట్లకు కాదు…నాడు నేడు ని… కొనసాగించి… బాగుపరిచిన .. బడి మెట్లకు,మీరు డిక్లరేషన్ ప్రకటించాల్సింది… ఇప్పుడు ఏ లోటు లేని… సనాతనం కోసం కాదు…మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన జనాల కోసం అని చురకలు అంటించారు రోజా.