Thursday, May 8, 2025
- Advertisement -

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం..చంద్రబాబు అరెస్ట్

- Advertisement -

చంద్రబాబు ఊహించిందే జరిగింది. ఆయనను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ ఊహించిందే. ఎందుకంటే ఆయన మెడకు ఐటీ నోటీసుల వ్యవహారంతో పాటు పుంగనూరు అల్లరల్లో ఏ1గా బాబే ఉన్నారు. అలాగే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో పెద్ద స్కామ్ జరిగిందని దీనిపై విచారణ చేపట్టాలని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం నంద్యాలలో ఉన్న చంద్రబాబను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే బాబు అరెస్ట్ సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించిన పేపర్లు, వివరాలను అందించి అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని విజయవాడకు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

2015లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు పేరుతో సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ సంస్థలతో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.3,356 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 శాతం. దీంతో రూ. 371 కోట్లు దారి మళ్లాయని ఆరోపణలు వచ్చి రాగా జగన్ సర్కార్ విచారణ చేపట్టింది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘంతో విచారణ కూడా జరిగింది. తొలుత విజిలెన్స్‌, తర్వాత ఏసీపీ విచారణ చేపట్టగా 2021 డిసెంబర్‌లో ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు.

ఇక చంద్రబాబు అరెస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం తనను అరెస్ట్ చేయవచ్చంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీయగా తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్ట్ కావడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -