- Advertisement -

ఆసీస్‌ను బంగ్లా వైట్‌వాష్ చేసేనా?

- Advertisement -

ఆస్ట్రేలియాపై 21 ఏళ్ల తర్వాత తొలి వన్డే గెలవడం ఆ తర్వాత రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది బంగ్లా. తాజాగా మూడో మ్యాచ్‌లోనూ గెలిచి ఆసీస్‌ను వైట్ వాష్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది బంగ్లా.

మరోవైపు ఆస్ట్రేలియా జట్టుకు ఏమైంది? అనేది ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న. టాప్-ఆర్డర్ బ్యాటింగ్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోవడంతో వారి ఫామ్‌ను అంచనా వేయడం కష్టంగా మారింది. మిడిల్ ఆర్డర్ ప్రదర్శన కూడా నిరాశాజనకంగానే ఉంది. గత మ్యాచ్‌లో మార్నస్ లబుషేన్‌ను 7వ స్థానానికి మార్చారు. ఆస్ట్రేలియా బౌలింగ్ కూడా అంతగా ప్రభావం చూపలేకపోతోంది. బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్ కొత్త బంతితో కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ బంగ్లాదేశ్ ఎదురుదాడి వ్యూహం వారిని రెండు సార్లు ప్రమాదం నుండి రక్షించింది.

ఈ సిరీస్‌ను 3-0తో గెలవడం బంగ్లాదేశ్ క్రికెట్‌లో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుంది. ఎందుకంటే గత రెండేళ్లుగా పేలవమైన ప్రదర్శనలతో సతమతమవుతున్న ఆ జట్టు ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోంది. పైగా ఈ విజయం బ్యాటింగ్, బౌలింగ్‌కు అనుకూలించే మంచి పిచ్‌పై రావడం విశేషం.
మెహిదీ హసన్ మిరాజ్ గాయం (Concussion) కారణంగా రిషాద్ హుస్సేన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది అలాగే నూరుల్ హసన్ బ్యాటర్‌గా ఆడే అవకాశం ఉంది. విశ్రాంతి తీసుకునే ఒక ఫాస్ట్ బౌలర్ స్థానంలో షరీఫుల్ జట్టులోకి రావచ్చు.

బంగ్లాదేశ్ (అంచనా జట్టు): 1 తంజిద్ హసన్, 2 సైఫ్ హసన్, 3 నజ్ముల్ హుస్సేన్ శాంటో, 4 తౌహీద్ హృదోయ్, 5 లిటన్ దాస్ (కీపర్), 6 మొసద్దెక్ హుస్సేన్, 7 నూరుల్ హసన్, 8 రిషాద్ హుస్సేన్, 9 తస్కిన్ అహ్మద్, 10 ముస్తాఫిజుర్ రెహమాన్, 11 నాహిద్ రాణా/షరీఫుల్ ఇస్లాం.

ఆస్ట్రేలియా (అంచనా జట్టు): 1 మాట్ షార్ట్, 2 కూపర్ కానోలి, 3 జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్ & కీపర్), 4 మాట్ రెన్‌షా, 5 అలెక్స్ కారీ, 6 కామెరాన్ గ్రీన్, 7 మార్నస్ లబుషేన్, 8 జేవియర్ బార్ట్లెట్, 9 నాథన్ ఎల్లిస్, 10 రిలే మెరెడిత్, 11 ఆడమ్ జంపా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -