Saturday, May 4, 2024
- Advertisement -

బీజేపీకి షాక్…సినీ నటుడు రాజీనామా

- Advertisement -

తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. కొంతకాలంగా పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కుతున్న బీజేపీ నేత బాబు మోహన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. బీజేపీలో తనని డి గ్రేడ్ నాయకుడిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీకోసం చాలా కష్టపడ్డానని చెప్పిన బాబు మోహన్…తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేశానని చెప్పారు. ఏ, బీ, సీ, డీ సెక్షన్లుగా నాయకులను విభజించి అత్యంత అవమానకరంగా నన్ను డి కేటగిరిలో పెట్టారంటూ విచారం వ్యక్తం చేశారు.

2018, 2023లో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేశారు బాబు మోహన్. అయితే ఓటమి తప్పలేదు. ఈసారి వరంగల్ పార్లమెంట్ సీటు కోసం ప్రయత్నించినా నిరాశస్త్ర ఎదురైంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో బాబు మోహన్‌కు సీటు కేటాయించింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పారు బాబు మోహన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -