పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమవరం నుండి పోటీ చేయడం కన్ఫామ్ అయింది. ఇవాళ భీమవరం పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు పవన్. తన పర్యటనలో భాగంగా పలువురు ప్రముఖులను కలుస్తూ చర్చలు జరిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి నివాసానికి వెళ్లి ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో బీజేపీ నేత పాకా సత్యనారాయణ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అయితే అక్కడే ఉన్న టీడీపీ కేడర్‌ను కలవకుండా వెళ్లిపోయారు పవన్. దీనిపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తికి ఎలా మద్దతు ఇస్తామని మండిపడ్డారు.
అయితే టీడీపీ నాయకులతో పవన్ మీటింగ్ రద్దుపై మాజీ మంత్రి పితాని సత్యనారయణ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కేడర్ ఏ మాత్రం వినలేదు. తమని కలవడానికే సమయం లేని వ్యక్తి ప్రజలను ఏ విధంగా కలుస్తారంటూ మండిపడ్డారు. ఇంకెప్పుడు పవన్ మీటింగ్‌కి పిలవొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది.