తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు అన్నామలై. తానుగా అధ్యక్ష పదవి రేసులో పాల్గొనడం లేదని..అయితే పార్టీకి మంచి భవిష్యత్తు కోరుకుంటున్నానని తెలిపారు.
బీజేపీ మంచి వ్యక్తులతో నడిచే పార్టీ అని, మంచి మనసుతో పనిచేసే నాయకులు అవసరమని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఎప్పుడూ బలంగా ఉండాలని కోరుకుంటున్నానని, బీజేపీకి మద్దతుగా తాను ఎప్పుడూ ఉంటానని అన్నామలై పేర్కొన్నారు.
అందరం కలిసి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటాం…పార్టీని మరింత ఎదిగించే దిశగా నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అన్నారు.అన్నామలై అధ్యక్షుడిగా ఉంటే పొత్తు కొనసాగించడం కష్టమని అన్నాడీఎంకే చెప్పినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడులో బీజేపీకి కొత్త శక్తిని తీసుకువచ్చారు అన్నామలై. డీఎంకే తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు. అన్నాడీఎంకే (AIADMK) – బీజేపీ మధ్య పొత్తు చర్చలు జరుగుతున్న క్రమంలో ఆయన తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
