Sunday, May 4, 2025
- Advertisement -

ఎంపీ బరిలో బొత్స ఝాన్సీ ..క్లారిటీ వచ్చేసింది!

- Advertisement -

వైసీపీలో సిట్టింగ్‌ల మార్పు ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి అసమ్మతి లేకుండా నాయకులను బుజ్జగిస్తు స్థానం చలనం లేదా మార్పు చేస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. ఇక ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన వ్యక్తి బొత్స సత్యనారాయణ.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేశారు. ఆయన సతీమణి బొత్స ఝాన్సీ ఎంపీగా పనిచేశారు. ఇక తాజాగా ఆమె మరోసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. విశాఖ నుండి బొత్స ఝాన్సీ బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోండగా దీనిపై క్లారిటీ ఇచ్చారు బొత్స. ఝాన్సీ పోటీ అప్రస్తుతమని, దీనిపై తన వద్ద ఎలాంటి సమాచారం లేదని తేల్చేశారు. హైకమాండ్ సూచనలను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన శైలీలో విమర్శలు గుప్పించారు బొత్స. టీడీపీని జాకీ, క్రేన్లు పెట్టి లేపినా లేవదని అది చంద్రబాబు అర్ధం చేసుకోలేకపోతున్నారన్నారు. వైసీపీని వీడేందుకు ఎవరు రెడీగా లేరన్న బొత్స..ఒకరు బయటికి వెళ్తే వందమంది బయటికి వస్తారన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -