- Advertisement -

Budget 2026: హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు..

- Advertisement -

లోక్‌సభలో 2026-27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు నిర్మలా సీతారామన్. ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు, కొత్త డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, 20 జాతీయ జలమార్గాల ఆపరేషన్లను ప్రతిపాదించారు. హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లలో హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-చెన్నై, పుణె-హైదరాబాద్‌ ఉన్నాయి.

అలాగే, ముంబై-పుణె, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగుడి, చెన్నై-బెంగళూరు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లను నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం గత ఏడాది రూ.11.2 లక్షల కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.12.2 లక్షల కోట్లు కేటాయించారు.

రాష్ట్రాలకు రూ.1.4 లక్షల కోట్ల పన్ను వాటా (ట్యాక్స్ డివోల్యూషన్) ను కేటాయించినట్లు ప్రకటించారు. 16వ ఆర్థిక సంఘం సిఫారసులను ప్రభుత్వం ఆమోదించి, 41 శాతం పన్ను పంపిణీ ఫార్ములాను కొనసాగిస్తుందని తెలిపారు. అలాగే, క్లౌడ్ సర్వీసులు మరియు డేటా సెంటర్ సేవల కంపెనీలకు 2047 వరకు పన్ను సెలవులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఆయుష్ ఫార్మసీలు, డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌ల అప్‌గ్రేడ్‌తో పాటు గుజరాత్ జామ్‌నగర్‌లోని WHO ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ప్రధాన పారిశ్రామిక లాజిస్టిక్స్ కేంద్రాల సమీపంలో ఐదు యూనివర్సిటీ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

షూస్, లెదర్ ఉత్పత్తులు చౌకగా మారనున్నాయి. నిర్దిష్ట ఇన్‌పుట్స్‌పై డ్యూటీ ఫ్రీ పరిమితిని పెంచుతామని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, ఈస్టర్న్ ఘాట్స్‌లోని అరకు వ్యాలీ, వెస్టర్న్ ఘాట్స్‌లలో పర్యావరణ హిత పర్వత మార్గాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు.

పన్ను సంస్కరణల్లో భాగంగా, మొదటి అప్పీల్ దశలో ఉన్న కేసులపై పెనాల్టీ మొత్తానికి వడ్డీ బాధ్యత ఉండదని ప్రకటించారు. అలాగే ఆరు నెలల విదేశీ ఆస్తుల వెల్లడింపు పథకం ప్రవేశపెట్టారు—విద్యార్థులు, టెక్ నిపుణులు, విదేశాల నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐలు సులభంగా ఆస్తులను క్రమబద్ధీకరించుకునేలా ఇది సహాయపడుతుంది. బాండెడ్ జోన్‌లో క్యాపిటల్ గూడ్స్ సరఫరా చేసే నాన్-రెసిడెంట్లకు ఐదు సంవత్సరాల ఆదాయపన్ను మినహాయింపు ప్రకటించారు. సవరించిన ఐటీ రిటర్న్ దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పెంచుతూ, స్వల్ప ఫీజుతో అవకాశం కల్పించారు.

విదేశీ టూర్ ప్యాకేజీలపై TCS రేటును 2 శాతానికి తగ్గించారు. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఇచ్చే వడ్డీపై ఆదాయపన్ను మినహాయింపు కల్పించారు; TDS కూడా ఉండదు. FY27లో రాజకోశ లోటు నిధుల కోసం ప్రభుత్వం రూ.11.7 లక్షల కోట్లు రుణంగా తీసుకోనుంది; లోటు జీడీపీకి 4.3% గా నిర్ణయించారు.

మహిళా స్వయం సహాయక సంఘాల కోసం ‘SHE మార్ట్స్’ కమ్యూనిటీ రిటైల్ అవుట్‌లెట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్బన్ క్యాప్చర్ అండ్ యుటిలైజేషన్ పథకానికి రూ.20,000 కోట్లు కేటాయించారు. సీప్లేన్ తయారీకి ప్రోత్సాహకాలు, నగరాల మధ్య ఏడు హై-స్పీడ్ కారిడార్లు, వారణాసి–పట్నాలో షిప్ రిపేర్ ఎకోసిస్టమ్, అలాగే ‘బ్యాంకింగ్ ఫర్ వికసిత్ భారత్’ పై హై-లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ప్రకృతికి నష్టం కలగకుండా, సహజ వనరులు అధికంగా దుర్వినియోగం చేయకుండా, భవిష్యత్ తరాలు కూడా వినియోగించుకునేలా అభివృద్ధి కొనసాగించిన నగరాల్లో ప్రయాణికుల రవాణా వ్యవస్థలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు. వన్యప్రాణి పర్యాటకం దృష్ట్యా ప్రత్యేక మార్గాలు రూపొందిస్తారు. ఒడిశా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో టర్టిల్ ట్రైల్స్, పులికాట్ సరస్సు చుట్టుపక్కల పక్షి వీక్షణ మార్గాలు వీటిలో ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -