కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో రక్షణ పరికరాలు, ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, ఫుట్వేర్ భాగాలు, ఈవీ బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్ వంటి వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపులు ప్రకటించగా, మరోవైపు మద్యం, ఖనిజాలపై భారం పెరిగింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటును జీడీపీకి 4.3 శాతంగా నిర్ధారించారు.
పలు వస్తువులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) మినహాయింపులు ప్రకటించారు. దీని వల్ల రక్షణ రంగ పరికరాలు, ఆరోగ్య రంగానికి సంబంధించిన ఔషధాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు చవకయ్యే అవకాశం ఉంది.అలాగే ప్రస్తుతం లెదర్, సింథటిక్ ఫుట్వేర్ ఎగుమతులకు వర్తిస్తున్న డ్యూటీ-ఫ్రీ ఇంపోర్ట్ సదుపాయాన్ని ఇకపై షూ అప్పర్స్ ఎగుమతులకు కూడా విస్తరించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
ధరలు తగ్గే వస్తువులు:
మైక్రోవేవ్ ఓవెన్
క్యాన్సర్ సహా ప్రాణాంతక వ్యాధులకు ఉపయోగించే 17 ఔషధాలు
లెదర్ ఉత్పత్తులు
క్రీడా పరికరాలు
మొబైల్ ఫోన్లు
ఎలక్ట్రిక్ వాహనాల (EV) బ్యాటరీలు
సోలార్ ప్యానెల్స్
ధరలు పెరిగే వస్తువులు:
మద్యం
ఖనిజాలు
బడ్జెట్ 2026–27ను ప్రవేశపెడుతూ, ప్రభుత్వం గత బడ్జెట్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక లోటును 4.4 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
