నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అంటే ఇదే. ఎందుకంటే పక్కరాష్ట్రం ఏపీలో అవినీతి కేసులో అడ్డంగా బుక్కయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీఐడీ పక్కా ఆధారాలతో బాబే ప్రధాన కుట్రదారు అని నిరూపించగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. కేసు తీవ్ర దృష్ట్యా బాబు ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తిరస్కరిస్తూనే ఉంది న్యాయస్థానం. ఇక స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం మాత్రమే కాదు మరిన్ని అవినీతి కేసుల్లో పీటీ వారెంట్ దాఖలు చేసింది సీఐడీ. దీంతో బాబు ఇప్పట్లో బయటికి వచ్చేలా కనిపించడం లేదు.
ఇక సీన్ కట్ చేస్తే బాబు అరెస్ట్ సింపతితో లబ్ది పొందేందుకు టీడీపీ శ్రేణులు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఐటీ ఉద్యోగులను రంగంలోకి దించారు. ఇక ప్రపంచ ఐటీ సృష్టికర్త బాబే అయినట్లు టీడీపీ ఐటీ సెల్ పెయిడ్ ఆర్టిస్ట్‌లు గగ్గొలు పెడుతున్నారు. హైదరాబాద్, బెంగళూరులో ఆందోళనలకు దిగారు ఐటీ ఉద్యోగులు. ఈ సందర్భంగా వారు చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాదు అందరి చేత నవ్వు తెప్పిస్తోంది.
ఎందుకంటే చంద్రబాబు బయటికొస్తే తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుందట. ఇంతకన్నా కామెడీ ఏదైనా ఉంటుందా?. ఇందుకు ఆ అపర ఐటీ మేధావులు చెబుతున్న రీజన్ ఏంటంటే..చంద్రబాబు బెయిల్ పై వస్తే ఏపీలో అధికారంలోకి వచ్చి ఐటీ కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్‌కే తరలివెళ్తాయట. అంతేగాదు చంద్రబాబు అరెస్ట్ పై జరుగుతున్న ఉద్యమాన్ని సీఎం కేసీఆర్, కేటీఆర్ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారట. ఇంతకన్నా పెద్ద జోక్ ఉంటుందా.
పక్కా రాష్ట్రంలో అవినీతి కేసులో దొరికిన బాబు గురించి ఇక్కడ ఉద్యమాలు చేయడం ఎంతవరకు కరెక్టో, వారి వెనుక ఉండి చేయిస్తున్న వారికే తెలియాలి.ఎందుకంటే తెలంగాణ ప్రజలు బాబు అరెస్ట్‌ను పట్టించుకోవడం సంగతి పక్కన పెడితే, కనీసం దీనిపై స్పందించే స్థితిలో కూడా లేరు. తెలంగాణ టీడీపీ నేతలే సైలెంట్‌గా ఉండాల్సిన పరిస్థితి. ఎక్కడ బాబు అరెస్ట్‌పై రోడ్డెక్కితే ఎక్కడ ఆంధ్రా అని ముద్రపడుతుందోనని తెలంగాణ తెలుగు తమ్ముళ్లు గమ్మున కూర్చున్న పరిస్థితి. కానీ ఐటీ ఉద్యోగులమని చెప్పుకుని ఆందోళన చేస్తున్నవారు మాత్రం ఈ చిన్న లాజిక్ మిస్సయి సోషల్ మీడియాలో నవ్వులపాలవుతున్నారు. ఐటీ ఉద్యోగుల ఐక్యూ…ఏమన్నా లాజిక్కా..ఇది వింటే స్టేట్‌మెంట్ కూడా సూసైడ్ చేసుకుంటుందని ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణ సంగతి పక్కన పెట్టు…అసలు ఏపీలో టీడీపీ గతంలో వచ్చిన 23 సీట్లైనా వస్తాయో తేల్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పటికైనా చంద్రబాబు అరెస్ట్‌పై సింపతి కావాలంటే ఏపీకి పోయి ఆందోళన చేయాలని, ఇక్కడ అనవసరంగా ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టించవద్దని హైదరాబాదీలు సూచిస్తున్నారు.