Tuesday, May 6, 2025
- Advertisement -

బాబు మధ్యంతర బెయిల్..తీర్పు రిజర్వ్

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌ విచారణ ముగిసింది. తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు.ఏపీ సీఐడీ తరపున పొన్నవొలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా చంద్రబాబు తరపున శ్రీనివాస్, లూథ్రా వాదనలు వినిపించారు. ప్రధానంగా చంద్రబాబు ఆరోగ్యం అంశాన్ని ప్రస్తావిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

ఇక చంద్రబాబు రిమాండ్‌ 50 రోజులకు పైగా రిమాండ్‌లో ఉన్నారని..కంటికి ఆపరేషన్ అవసరమని వైద్యులు చెప్పిన అంశాన్ని కోర్టుకు తెలిపారు. సీఐడీ తరపు లాయర్ తమకు సమయం కావాలని కోరగా వాదనలు ఎప్పుడు వినాలన్న అంశంపై మంగళవారం నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి తెలిపారు.

హైకోర్టుకు దసరా సెలవులకు ముందు పదే పదే బెయిల్ పిటిషన్లు వాయిదాలు పడ్డాయి. తర్వాత వెకేషన్ బెంచ్ లో విచారణ జరిగినా న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ చెప్పటంతో కేసు వాయిదా పడింది. ఏసీబీ కోర్టు బెయిల్‌ నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ తో పాటు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మొత్తంగా నవంబర్ 8 లోపు తీర్పు వెలువడే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -