Sunday, May 4, 2025
- Advertisement -

ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు

- Advertisement -

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనుండగా ఇవాళ మంగళగిరి విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసనసభా పక్షసమావేశంలో చంద్రబాబును ఫ్లోర్ లీడర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్…చంద్రబాబు పేరును ప్రతిపాదించగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మద్దతిచ్చారు. దీంతో చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్ కు పంపనున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు.

ఇక జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కల్యాణ్ ను జనసేన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశంలో పవన్ పేరును నాదేండ్ల మనోహర్ ప్రతిపాదించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -