Wednesday, May 14, 2025
- Advertisement -

పవన్ ఎంత ట్రై చేసినా 30 లోపే!

- Advertisement -

టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ కోసం రెండు పార్టీల నేతలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ ప్రకటించాల్సి ఉండగా బీజేపీ ఎంట్రీతో వాయిదా పడింది. అయితే చంద్రబాబు – పవన్ ఇద్దరూ జనసేన పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి పొత్తులో భాగంగా 60 అసెంబ్లీ స్థానాలను డిమాండ్ చేశారు పవన్. కానీ పలు దఫాల్లో జరిగిన చర్చల్లో క్రమక్రమంగా తగ్గుకుంటూ 30 అసెంబ్లీ స్థానాల లోపే చేరినట్లు సమాచారం. అయితే సీట్ల సంఖ్యపై పవన్ ఎంత ఒత్తిడి తెచ్చినా చంద్రబాబు మాత్రం తన పంతాన్నే నెగ్గించుకున్నారు. దీంతో చేసేదేమీ లేక పవన్ సైతం చంద్రబాబు చెప్పిన నెంబర్ కే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక జనసేన వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 26 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని జనసేన సీనియర్ నేతలకు పవన్ చెప్పారని తెలుస్తోంది. ఇక జనసేన పోటీచేసే స్థానాలపై క్లారిటీ రావడంతో బీజేపీకి ఎన్నిసీట్లు కేటాయిస్తారనే ప్రశ్న మొదలైంది. బీజేపీకి 12 అసెంబ్లీ సీట్లు, 5 లోక్ సభ నియోజకవర్గాలను కేటాయించటానికి చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. మొత్తంగా పొత్తులపై ఈ నెలాఖరులోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -