Tuesday, May 6, 2025
- Advertisement -

మందు బాబులకు చంద్రబాబు గుడ్‌న్యూస్!

- Advertisement -

ఏపీలో మద్యపానం నుండి యువకులను దూరం చేసేందుకు వైసీపీ ప్రభుత్వంలో చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ మాత్రం ప్రజల ఆరోగ్యంకే మొగ్గుచూపారు. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారింది. త్వరలో ఏపీలో మద్యం ఏరులై పారనుంది.

ఇప్పటికే రాష్ట్రంలో అన్ని రకాల బ్రాండ్లకు అనుమతులు ఇచ్చిన చంద్రబాబు త్వరలో మరికొన్ని కొత్త బ్రాండ్లు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేగాదు లిక్కర్ రేటును తగ్గించి సేల్స్ పెంచేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు.

ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిళ్ల ధర రూ.100 లోపే ఉండనుంది. కొత్త మద్యం పాలసీ అక్టోబర్ నెల నుంచి అమల్లోకి రానుందని తెలుస్తోంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీపై అద్యయానికి చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం.

4 బందాలను ఏర్పాటు చేయగా ఈ బృందాలులు 6 రాష్ట్రాల్లో అధ్యయనం చేయనున్నాయి. ఒక్కో బృందంలో ముగ్గురు అధికారులు ఉండగా వీరు ఇచ్చిన నివేదిక ఆధారంగా అక్టోబర్ నుంచి నూతన ఎక్సైజ్ విధానం అమల్లోకి రానుంది. ఎక్సైజ్ పాలసీ, మద్యం షాపులు, బార్ లు, ధరలు, మద్యం కొనుగోళ్లతో పాటు నాణ్యం, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై పూర్తి వివరాలు ఏపీ కొత్త మద్యం పాలసీలో ఉండనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -