స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలుదఫాలుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయస్థానం వాటిని వాయిదా వేస్తూ వస్తోంది. మరో వైపు పలు కేసుల్లో చంద్రబాబే ముద్దాయని పేర్కొంటూ సీఐడీ పీటీ వారెంట్‌లు దాఖలు చేస్తున్న నేపథ్యంలో బాబుకు బెయిల్ రావడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బాబకును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ ఉదయం 11 గంటలకు తీర్పు ఇవ్వనుండి ఏసీబీ కోర్టు. ఇరువర్గాల వాదనలను సదీర్ఘంగా విన్న న్యాయస్ధానం తీర్పును ఇవాళ్టికి వాయిదా వేయగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.దాదాపు మూడు గంటల పాటు చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. కస్టడీకి ఇవ్వాలని ఏఏజీ.. అంత అవసరం లేదని లూథ్రా వాదనలు వినిపించారు.
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతి చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవని మొదటి నుండి వాదిస్తున్న తాజాగా అదేవాదనను కంటిన్యూ చేశారు. చంద్రబాబు అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని …ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడమే కాకుండా కస్టడీకి కోరడమేంటని ప్రశ్నించారు. ఇక ఏఏజీ పొన్నవోలు కూడా సీఐడీ తరపున బలంగానే వాదనలు వినిపించారు. ఆన్ని ఆధారాలతోనే అరెస్ట్ జరిగిందని.. కేసుతో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కర్నీ మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఈ కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికితీయడమే అసలు ఉద్దేశమని… చంద్రబాబును కస్టడీకి ఇస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు. నేటితో 12 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉండగా కస్టడీకి అప్పగిస్తే మరిన్ని రోజులు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని పలువురు చెబుతున్నారు.