Thursday, May 8, 2025
- Advertisement -

చంద్రబాబు బెయిల్ రద్దు…విచారణ వాయిదా

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బాబు రెగ్యులర్ బెయిల్‌ని రద్దు చేయాలని ఏపీ సీఐడీ సుప్రీంను ఆశ్రయించగా ఇవాళ విచారణకు వచ్చింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం పేర్కొంది. బెయిల్ కండీషన్లు అన్ని యథాతథంగా అమల్లో ఉంటాయని..స్కిల్ కుంభకోణం కేసు గురించి ప్రకనట చేయవద్దని ఆదేశించింది.

కేసుకు సంబంధించిన విషయాలను మీడియాలో మాట్లాడొద్దన్న షరతును గతంలో హైకోర్టు తొలగించగా తిరిగి చంద్రబాబుకు ఆ షరతును విధించింది. ర్యాలీలు నిర్వహించడం, పొలిటికల్ మీటింగ్స్‌లో పాల్గొనడంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. తదుపరి విచారణ డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.

ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయ్యిందన్న అంశాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఏపీ సీఐడీ తెలిపింది. చంద్రబాబుకు బెయిల్ విషయంలో హైకోర్టు పరిధి దాటిందని …సుప్రీంకోర్టు నిర్దేశించిన కొలమానాలను హైకోర్టు అతిక్రమించిందని ఏపీ సీఐడీ పేర్కొంది.నిధుల దుర్వినియోగానికి సంబంధించిన పూర్తి ఆధారాలున్నా హైకోర్టు ఏ మాత్రం పట్టించుకోలేదని ..చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో తేలేంతవరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఏపీ సిఐడి కోరింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -