టీడీపీ అధినేత చంద్రబాబుకు చురకలు అంటించారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. పొత్తు ధర్మాన్ని చంద్రబాబు విస్మరించారన్నారు జోగయ్య. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో లేఖను విడుదల చేసిన జోగయ్య.. టీడీపీ – జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పొత్తు ధర్మంలో జనసేనను విస్మరిస్తూ చంద్రబాబు టీడీపీ అభ్యర్థులను మండపేట, అరకు నియోజకవర్గాలకు ప్రకటించడం తప్పని అన్నారు. ఇలాంటి చర్య పొత్తుధర్మాన్ని విస్మరించడమే అవుతుందని మండిపడ్డారు. రాజోలు, రాజానగరం సీట్లను పవన్ ప్రకటించినప్పటికీ జనసైనికులు సంతృప్తి చెందడం లేదన్నారు.
సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి, ఉంగుటూరు, తణుకు, నిడదవోలు నియోజకవర్గాలను జనసేనకు ప్రకటించినట్లయితే పవన్ కల్యాణ్ కు ఎంత నిబద్దత ఉందో తేటతెల్లమయ్యేదని కితాబిచ్చారు. జనసేనకు టీడీపీకి ఎక్కువ సీట్లు కేటాయించాలని అప్పుడే రెండు పార్టీలకు మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఒకవేళ తక్కువ స్థానాలకు పవన్ ఒప్పుకుంటే అది విఫల ప్రయోగమే అవుతుందన్నారు. మ