తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ప్రధానంగా వినిపిస్తున్న మాట సిట్టింగ్‌ల మార్పు. పలుచోట్ల సిట్టింగ్‌లను మార్చగా వారు విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ ఓటమికి కారణం సిట్టింగ్‌లను మార్చకపోవడమే. ఇక ఇదే ఫార్ములానే ఏపీలోనూ ఫాలో అవుతున్నాయి ప్రధాన పార్టీలు. ఇక వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే పలు స్థానాలకు కొత్త ఇంఛార్జీలను నియమించగా మరికొంతమందిని మారుస్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే జగన్ సిట్టింగ్‌లను మార్చడంపై విమర్శలు గుప్పించిన టీడీపీ నేతలు ఇప్పుడు అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున 23 మంది ఎమ్మెల్యేలు గెలవగా వీరిలో నలుగురు(కరణం బలరాం, వల్లభనేని వంశీ,వాసుపల్లి గణేష్,మద్దాలి గిరిదర్) టీడీపీ నుండి బయటికి వచ్చి వైసీపీకి మద్దతిస్తున్నారు.
ఇక మిగిలింది 19 మంది కాగా వీరిలో చాలా మందికి స్థాన చలనంతో పాటు సీట్లు ఇచ్చేది కూడా డౌటేనని తెలుస్తోంది. విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరా వును భీమిలికి లేదా మరో స్థానానికి పంపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే కొంతమందిని ఎమ్మెల్సీగా పంపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీపై విమర్శలు గుప్పించి భయపడుతున్నారని ప్రచారం చేసిన టీడీడీ నేతలు మొఖం చాటేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు గతంలో చేసింది ఇదే.. ఇప్పుడు చేస్తుంది ఇదే కానీ ఇది అర్థం కానీ టీడీపీ నేతలు చేస్తున్న మాటలు మాత్రం ప్రజల చేత నవ్వు తెప్పిస్తోంది.